మురారి ప్రేమించిన అమ్మాయి ఎవరో కృష్ణ తెలుసుకుంటుందా!
on Jun 4, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -174 లో.. కృష్ణ, మురారిలు ఒకరికొకరు తమ మనసులో ఉన్న ప్రేమని చెప్పుకోలేక ఇద్దరు బాధపడుతుంటారు. ఒకవైపు మురారి మనసులో ఎవరో ఉన్నారని తన ప్రేమని చెప్పకుండా కృష్ణ బాధపడుతుంటే, మరొకవైపు మురారి తన ప్రేమని కృష్ణకి ఎలా చెప్పాలి.. చెప్తే ఎలా తీసుకుంటుందోనని మురారి ఆలోచిస్తుంటాడు.
మరొకవైపు ముకుంద అన్న మాటలన్నీ రేవతి గుర్తుచేసుకుంటూ.. ఎక్కడ తన కొడుకు-కోడలి కాపురంకి అడ్డు పడుతుందోనని భయపడుతుంది. అప్పుడే రేవతి దగ్గరికి వచ్చి మురారి మాట్లాడకుండా.. ఏదో తప్పు చేసినవాడిలా వెన్నక్కి వెళ్ళిపోతాడు. కాసేపటికి ఈ రోజు కృష్ణని ఎలాగైనా బయటకు తీసుకెళ్ళి అసలు కృష్ణ మనసులో ఏముందో తెలుసుకుంటానని అనుకుంటాడు మురారి. కృష్ణ పడుకొని ఉంటే తనని నిద్రలేపుతాడు. బ్రేక్ ఫాస్ట్ కి రెస్టారెంట్ కి వెళదాం రెడీ అవు కృష్ణ అని చెప్పి, అలాగే నాకు డ్రెస్ సెలెక్ట్ చెయ్ అని మురారి అంటాడు. సరే అని కృష్ణ చెప్పి మురారి బట్టలు తీసుకొని వస్తుంది. మురారి బట్టలలో డైరీ ఉందని మురారి కంగారు పడతాడు. కానీ ముందే కృష్ణ ఆ డైరీ చదివేసిందని తెలియక టెన్షన్ పడతాడు. ఆ తర్వాత మురారికి డ్రెస్ సెలక్ట్ చేసి కృష్ణ వెళ్ళిపోతుంది. ఈ డైరీలో కృష్ణ గురించి కూడా రాసాను.. అది చదివితే నా ప్రేమ కృష్ణకి అర్థంమవుతుంది కానీ ముకుంద గురించి కూడా ఇందులోనే రాసా మరి అది చదివితే ఎలా అని మురారి అనుకుంటాడు. ఆ తర్వాత కృష్ణ, మురారిలు రెడీ అయి కిందకి వస్తారు. రేవతికి బయటకు వెళ్తున్నామని కృష్ణ చెప్తుంది కానీ మురారి మాత్రం రేవతితో మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతాడు.
మరొకవైపు ముకుంద తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. ముకుంద ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి తన ఫ్రెండ్ కి చెప్తుంది. మరొకవైపు కృష్ణ, మురారిల ప్రపోజ్ వీడియోకి మంచి వ్యూస్ వస్తున్నాయ్.. ఎలాగైనా బ్రేకప్ వీడియో ఒకటి చెయ్యాలని మధు అనుకుంటాడు. కృష్ణ, మురారి లు ఇద్దరు కలిసి ముకుంద తన ఫ్రెండ్ ఉన్న రెస్టారెంట్ కే వెళ్తారు. ముకుంద ఫ్రెండ్ మురారితో మాట్లాడడం చూసి.. ఏసీపీ సర్ నా ఫ్రెండ్ కి ఎలా తెలుసని ముకుంద అనుకుంటుంది. అయితే అదే సమయంలో "ఈ అమ్మాయికి ఏసీపీ సర్ ప్రేమించిన అమ్మాయి తెలుసేమో కనుక్కోవాలి" అని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read